APCRDA చట్టం రద్దును సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

0
46

అమరావతిలో నిర్మాణాల నిలిపివేత… రాజధాని రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షను ఉల్లంఘించేదిగా ప్రకటించాలంటూ విజయవాడ వ్యాపారి శీలం మురళీధర్ రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. రాజధాని పరిధిలో నిర్మాణ పనులు ఆపేయడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొనాలని కోరారు. APCRDA చట్టం రద్దు అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. రాజధాని నిర్మాణం ఆగిపోతే… భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు, పేదల హక్కులు హరించినట్లు అవుతుందన్నారు. దురుద్దేశంతో తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంతో భారీ నష్టం జరుగుతుందని వివరించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య పాట్లు కేటాయించారని… అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకు ఇప్పటికీ భారీగా ఖర్చు చేశారని, ఎన్నో సంస్థలకు భూముల కేటాయింపు జరిగిందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణానికి దాతలు సుమారు 42 కోట్లు ఇచ్చిన విషయం ప్రస్తావించారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా, పక్షపాత ధోరణితో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం వ్యవహరిస్తోందని అన్నారు. రాజధాని నిర్మాణంపై గత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త సర్కారు కొనసాగించాలే తప్ప, ఇష్టానుసారం ఆపేయడానికి వీల్లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here