కత్తి మహేష్‌పై దాడి.. చితకబాదిన బజరంగ్‌దళ్ కార్యకర్తలు

0
54

హైదరాబాద్ : హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై బజరంగ్‌దళ్ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. ఐ మాక్స్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసి వస్తుండగా ముగ్గురు బజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని అందుకు దాడి చేశామని ముగ్గురు తెలిపారు. సైఫాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్ పోలీసులు తెలిపారు.సిసిఎస్‌లో కేసులు…

గతంలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేయడంతో వారు కేసును సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేశారు. సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేష్‌పై గురువారం కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here