రొటీన్ కథే అయినా హిట్ సాధించారు – భీష్మ రివ్యూ

0
92

అప్పుడెప్పుడో వరుస హిట్లు సాధించిన నితిన్ తర్వాత మళ్ళీ హిట్లు వైపు అసలు చూడలేదు. కథలో లోపం వల్లో లేక డైరెక్టర్ లోపం వల్లో కానీ ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమా నిరాశపరిచింది. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అనే కసి ఉన్న నితిన్ భీష్మ అంటూ మన ముందుకి వచ్చాడు. సినిమాల్లో మెసేజ్ లు ఇస్తే సుత్తి అంటారు. దాన్ని చెప్పాల్సిన రీతిలో చెబితే సూపర్ అంటారు. భీష్మ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుముల ఇదే చేశాడు. వ్యవసాయం గురించి ఒక సినిమాలో ఇంత వినోదాత్మకంగా చెప్పడం ఈ మధ్య మనం చూడలేదు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో భీష్మ తెరకెక్కించాడు దర్శకుడు. సేంద్రియ వ్యవసాయం గొప్పతనం చెబుతూనే చాలా చోట్ల కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేసాడు వెంకీ. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ వచ్చిన ప్రతిసారి నవ్వులే నవ్వులు. నితిన్ కూడా కెరీర్లో తొలిసారి ఇంత ఎంటర్టైనింగ్ రోల్ చేశాడు. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషన్ కూడా బాగా పండించాడు. హీరో క్యారెక్టరైజేషన్ దర్శకుడు వెంకీ కుడుముల చాలా బాగా రాసుకున్నాడు. ఇంటర్వెల్ కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కామెడీ బాట పట్టాడు వెంకీ. అయితే ఎంత నవ్వించినా కూడా తాను చెప్పాలనుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ విషయం మాత్రం పక్కదారి పట్టించలేదు. సందేశం ఇస్తే ఇంత సరదాగా ఉంటుందా అన్నట్లుగా ఈ సినిమా తీశాడు. తెలిసిన కథే అయినా కూడా తెలివైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా ఆయన గురువు త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో కనిపించింది. మాటలు కూడా బాగానే రాసుకున్నాడు. సెకండాఫ్ లో రెండు మూడు కామెడీ సీన్స్ బాగా పేలాయి. రష్మిక మందన మరోసారి గీతగోవిందం తరహాలో హీరో ను డామినేట్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా ఉంటాయి. ఛలో సినిమాలో కేవలం కామెడీపై ఫోకస్ చేసిన వెంకీ ఈ సారి మాత్రం కామెడీతో పాటు కథను బలంగా రాసుకున్నాడు.

ఓవరాల్ గా రొటీన్ కథే అయినా డైరెక్టర్ కథని కామెడీ తో చెప్పడం వల్ల భీష్మ పెద్ద విజయ్ సాధించింది.

Rating – 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here