రజనీకాంత్ ఫాన్స్ కు పెద్ద పండగే – దర్బార్ రివ్యూ

0
100

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫాన్స్ కి పెద్ద పండగ. తలైవా స్క్రీన్ మీద కనిపిస్తే ఎదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. కాకపోతే కొన్నేళ్లుగా వరుస ప్లాప్స్ తో ఆ వైబ్రేషన్ కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది .రజనీ ఇమేజ్ ను పర్ఫెక్టుగా హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు లేరా అనిపించింది. కానీ ఇన్నాళ్లకు మురుగుదాస్ రజిని ని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే కొత్త ఆశ చిగురించింది ఎందుకంటే మిగిలిన దర్శకులతో పోలిస్తే రజనీని కాస్త బెటర్ గా చూపిస్తాడు అనే ఆశ.
ఆ ఆశ ను ఏ మాత్రం చాలార్చకుండా చాలా ఏళ్ల తర్వాత పోలీసు ఆఫీసర్గా రజనీకాంత్ ను ఫ్ ఆడించాడు మన దర్శకుడు. ఆదిత్య అరుణాచలం అంటూ పాత సూపర్ స్టార్ ను గుర్తు తెచ్చాడు తెలిసిన కథే అయినా స్క్రీన్ ప్లేతో కథను ముందుకు నడిపించాడు. ఫస్టాఫ్ చాలా చోట్ల విజిల్ పడే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా రాసుకున్నాడు మురుగుదాస్.ఈ వయసులో కూడా రజనీ ఎనర్జీ చూస్తే వావ్ అనిపిస్తుంది. డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ముంబై బ్యాక్డ్రాప్ లో ఈ కథ నడుస్తుంది. దానికి రజనీ ఇమేజ్ ను ఫర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి దర్బార్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు మురగదాస్. ఈ క్రమంలోనే మాస్ ఆడియన్స్ మెచ్చేలా చాలాచోట్ల అదిరిపోయే సన్నివేశాలు ఉన్నాయి. ఉమెన్ ట్రాఫికింగ్ ట్రాక్ చేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మెట్రో ఫైట్ సీన్ అభిమానులకు అయితే కన్నుల పండగే అని చెప్పొచ్చు హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయింది. కానీ సెంటిమెంట్ సన్నివేశాలు ఉండడం తో కవర్ అయిపోతుంది. కాకపోతే క్లైమాక్స్ ఇంకొంచం బెటర్ గా తీసుంటే బాగుండదేది. విలన్ బలంగా ఉన్న ఎలివేషన్ సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. హీరో కి పోటీ పడేలా ఉండాల్సింది. ఇక రజినీకాంత్ నటన గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు ఆయన నటనతో స్టైల్ తో కుమ్మేసాడు. నయనతారకు పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కలేదు. క్రేజ్ కోసం పెట్టినట్లు అనిపించింది. ఉన్నంతలో తో తన పాత్రకు న్యాయం చేసింది. ప్రతినాయకుడుగా సునీల్ శెట్టి బాగున్నాడు. కానీ బలమైన సన్నివేశాలు ఒకటి కూడా లేవు. రజనీకాంత్ కూతురుగా నివేద థామస్ అద్భుతంగా నటించింది.

ఓవరాల్గా ఇది రజనీకాంత్ ఫాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి. పోలీస్ గా రజినీకాంత్ నటన మరోలెవెల్ లో ఉంటుంది.

Rating – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here