డిఫెరెంట్ సైఫై సినిమా – డిస్కో రాజా రివ్యూ

0
68

వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలాగే తన అభిమానులను నిరాశపరిచిన రవితేజ ఈసారి ఎలాగైనా మంచి హిట్ సాధించాలి అనే కసిమీద ఎప్పటికప్పుడు సరి కొత్త పాయింట్ తో సినిమాలు తీసే దర్శకుడు వి ఐ ఆనంద్ తో జత కట్టి మనముందుకు డిస్కో రాజా అంటూ వచ్చేసాడు. చనిపోయిన మనిషి మళ్లీ కొన్నేళ్ళ తర్వాత బతికే ఛాన్స్ ఉందా ? వినడానికే చిత్రంగాను ఆశ్చర్యం గా ఉంది కదా. అదే పాయింట్ ని కథగా రాసుకున్నాడు దర్శకుడు విఐ ఆనంద్. డిస్కో రాజా కథ మొదలవ్వడమే అలా మొదలైంది. దాంతో ఆసక్తి కూడా ఆటోమేటిక్‌గా అలా వచ్చేసిందంతే. ఫస్టాఫ్ కొన్నిచోట్ల వింటేజ్ రవితేజ కనిపించాడు. డిస్కో ఆర్ఆర్ అయితే పీక్స్ ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడల్లా తెలియకుండానే మన తల, కాళ్లు కదిలేస్తాయి. చనిపోయిన మనిషిని సైన్స్‌తో బతికించడం. తనను చంపిన వాళ్ల కోసం హీరో వెతకడం. ఆ క్రమంలోనే గతం తెలుసుకోవడం ఇదే డిస్కో రాజా కథ. అన్నీ ఫస్టాఫ్‌లోనే చకాచకా చూపించేసాడు దర్శకుడు విఐ ఆనంద్. అప్పటి వరకు స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగానే సాగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండటంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఫస్టాఫ్ ఇచ్చిన బిల్డప్‌తో డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ అంచనాలు అమాంతం పెంచేసింది. కానీ సెకండాఫ్ మాత్రం అలా అసలు ఉండదు. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ ఎపిసోడ్ ఆసక్తికరంగా అనిపించలేదు. కథకు స్పీడ్ బ్రేకర్‌గా మారిపోయింది. రవితేజ రెట్రో స్టైల్స్ మాత్రం అదుర్స్. ఫస్టాఫ్ స్పీడ్ సెకండాఫ్ తట్టుకోలేక తగ్గిపోయింది. 80లలో జరిగిన కథ కావడంతో దాన్ని సెకండాఫ్‌లో బాగానే ఎలివేట్ చేసాడు దర్శకుడు ఆనంద్. ఇది ప్రయోగమే కానీ రవితేజ స్టైల్లో చెప్పడంతో అక్కడక్కడా కథ రొటీన్ అయిపోయింది. చివరికి అది మన అంచనాలను తారుమారు చేస్తూ రివేంజ్ డ్రామా కథల ముగుస్తుంది. మనలను కొంచం ఆకర్షించేది ఎదిన ఉంది అంటే అది క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే. సినిమాలో రవితేజ తర్వాత బాబీ సింహా కారెక్టర్ అదిరిపోయింది. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఏదో మ్యాజిక్ ఉంటుంది. తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక కమెడియన్ సునీల్ కూడా సర్ ప్రైజింగ్ రోల్‌తో అదరగొట్టాడు. క్లైమాక్స్ మొత్తం సునీల్ కె సొంతం అన్నట్టు ఇరగదీసాడు. తమన్ సంగీతం అదిరిపోయింది. ముఖ్యంగా ఆర్ఆర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. హీరోయిన్స్ పాయల్, నభా నటేష్, తాన్యా హోప్ జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే ఉన్నారూ.

ఓవరాల్‌గా రవితేజ నుంచి వచ్చిన డిఫెరెంట్ సైఫై సినిమా డ్రామా డిస్కో రాజా.

Rating – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here