ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా – హిట్ రివ్యూ

0
61

 

మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ కాలపు హీరోలలో విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉంటాడు. చేసింది మూడే సినిమాలు కానీ పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఈసారీ ఒక కొత్త దర్శకుడితో క్రైమ్ థ్రిల్లర్ స్క్రిప్ట్ తోటి హిట్ అనే సినిమా చేసాడు. ఒక ఫంక్షన్లో 15 నిమిషాలు మీరు థియేటర్‌లో కూర్చోండిఆ తర్వాత నేను కూర్చోబెడతా అని విశ్వక్ చెప్పినపుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అనుకున్న సినిమా చూసాక మాత్రం చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పాడు అనిపిస్తుంది. కాకపోతే మధ్యలో పాస్ పోసుకోడానికి కూడా మీకు గ్యాప్ ఉండదని అని చెప్పినంత స్థాయిలో సినిమా లేదు కానీ కచ్చితంగా చూడదగ్గ మాస్ థ్రిల్లర్ సినిమా. పాటలు లేవు, కామెడీ ఉండదు, కమర్షియల్ హంగులు కూడా చాలా తక్కువే కేవలం ఓ కేస్ పట్టుకుని సినిమా అంతా ఇన్వెస్టిగేట్ చేయడం అంటే మాటలు కాదు ఎందుకు అంటే స్క్రీన్ ప్లే పక్కాగా ఉంటే కానీ సినిమా ముందుకెళ్లదు కొత్త దర్శకుడు శేలేష్ అదే చేసాడు. చిన్న పాయింట్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం ఆసక్తికరంగా ప్రేక్షకులను కూర్చోబెట్టే విదంగా రాసుకున్నాడు. అయితే ఒకే కేస్‌పై ముందుకెళ్లే కథ కావడంతో అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించింది. ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు తెలుగులో కొత్త కాదు కానీ హిట్ మాత్రం కొత్త స్క్రీన్ ప్లే తో కొత్తగా తీసాడు దర్శకుడు. ట్విస్టులు ఓపెన్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు శేలేష్ కొలను. చిన్న పాయింట్ కూడా వదలకుండా ప్రాపర్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించాడు. ఓ అమ్మాయి మిస్ కావడం దాని చుట్టూ అల్లుకున్న డ్రామా మధ్యలో ఎవరెవరిపైనో అనుమానాలు చివర్లో ఎవరూ ఊహించని క్రిమినల్ ఇవన్నీ ఇదివరకు కూడా చూసాం కానీ ఇందులో ఇంకాస్త ఫ్రెష్‌గా అనిపిస్తుంది. విశ్వక్ సేన్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. తన మాస్ ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించకుండా ప్రతి సీన్ లో తనదయిన ముద్ర వేసాడు విశ్వక్. సీరియస్ పాత్రలో చాలా సీరియస్‌గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటనాతో ప్రేక్షకులను కట్టిపడేసాడు.రుహానీ శర్మ పర్లేదు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ బాగానే పండింది. ఇక మురళీ శర్మ, భానుచందర్ క్యారెక్టర్ పర్లేదు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. నాని ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి. కెమెరా పని తనం కూడా చాలా బాగుంది.

ఓవరాల్‌‌గా చూసుకుంటే ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా కథతో విశ్వక్ సేన్ ” హిట్ ” సాధించాడు.

Rating – 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here