ఎమోషనల్ కథలకు కనెక్ట్ అయ్యే వాళ్లకు జాను మంచి ఛాయిస్ – జాను రివ్యూ

0
53

కొన్ని సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఒక భాషలో క్లాసిక్ సినిమా అని నిరూపితం అయిన సినిమా మరో భాషలో వస్తుంటే తెలియకుండానే మనలో ఆసక్తి పెరిగిపోతుంది.అలా నాలో ఎంతో ఆసక్తి పెంచేసిన సినిమా 96. తెలుగులో జాను గా శర్వా, సమంత నటించిన సినిమా. ఎందుకో అందరూ చెప్పినంత క్లాసిక్ సినిమా అనిపించలేదు కానీ. అక్కడక్కడా ప్రేమ చేసే మ్యాజిక్ మాత్రం చాలా బాగా నచ్చింది. స్కూల్ లవ్ అంటే అందరికీ ప్రత్యేకమే మరియు అందరికి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. విడిపోయిన ప్రేమికులు మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. జానులో అంతకంటే కొత్తగా ఏమీ కనిపించలేదు కానీ. స్కూల్ డేస్ గుర్తుచేస్తూ దర్శకుడు చేసిన స్క్రీన్ ప్లే మ్యూజిక్ అక్కడక్కడ బాగానే వర్కవుట్ అయింది. శర్వానంద్, సమంత కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్ డేస్ లవ్ స్టొరీ చూపించారు. రీయూనియన్ పార్టీ లో సమంత ఎంట్రీ అదుర్స్. సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చాలా మటుకు సీన్ టు సీన్ దించేసాడు దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్లకు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నా కూడా. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్ అవుతుంది. కానీ మరో పక్క ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి అని సరిపెట్టుకోవాలేమో అనిపిస్తుంది. శర్వానంద్ విజయ్ సేతుపతి లా యాక్టింగ్ చేస్తాడా అని చాలా మందికి ఉన్న అనుమానం.ఆ అనుమానాలు అన్నిటిని చేరిపేస్తూ తన నటనే ఈ సినిమా కి పెద్ద ప్లస్ అని చెప్పుకునేల నటించాడు కాదు కాదు జీవించాడు అని చెప్పవచ్చు. ఇక సమంత గురించి కానీ ఆమె నటన గురించి కానీ మనం ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. శర్వా, సమంతల కెమిస్ట్రీ మాత్రం అదుర్స్. ఇక వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లు సినిమాలో కీలక పాత్రే పోషించారు. స్కూల్ ఏజ్ లో వచ్చే పిల్లలు అందరూ బాగానే నటించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ నటనతో సినిమాకు ప్రాణం పోశారు.

ఓవరాల్ గా ఎమోషనల్ కథలకు కనెక్ట్ అయ్యే వాళ్లకు జాను మంచి ఛాయిస్.

Rating – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here