యాంటీ క్లైమాక్స్ ఉంటుందా ?? – జాను ట్రైలర్ రివ్యూ

0
74

2019లో విజయ్ సేతుపతి, త్రిష కాంబో లో వచ్చిన తమిళల సూపర్‌ హిట్‌ సినిమా ’96’ ను తెలుగులో ‘జాను’గా రీమేక్‌ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఫస్ట్‌ లుక్‌ నుండి టీజర్‌ మరియు పాటల వరకు అన్ని కూడా తమిళ 96 కు మక్కీకి మక్కీ దించినట్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటి అంటే 96 చిత్రానికి యాంటీ క్లైమాక్స్‌ ఉంటుంది. అంటే హీరోయిన్‌ వేరే అబ్బాయిని  పెళ్లి చేసుకోవడం హీరోను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్లి పోతుంది. కాని తెలుగులో అలా ఉంటుందా లేదా అనేదే అనుమానం. ఎందుకు అంటే తమిళంలో మాదిరిగా కాకుండా తెలుగులో అలా చేస్తే తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవతారో లేదో అనే డౌట్ తో తెలుగు ప్రేక్షకులు కు నచ్చే విధంగా క్లైమాక్స్‌ ఉంటుందేమో అనే ఊహాగాణాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సమంతకు ఈ సినిమాలో పెళ్లి కాదేమో క్లైమాక్స్‌ లో శర్వానంద్‌ ను పెళ్లి చేసుకుంటుందేమో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. ఈ మొత్తం ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఫిబ్రవరి 7 వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here