జగన్ పద్మవ్యూహంలో బాబు ఇరుక్కున్నాడు అంటూ వైస్సార్సీపీ కొత్త నాటకం

0
47

మూడు రాజధానుల బిల్లు ద్రవ్యబిల్లుగా పెట్టి శాసనమండలికి పంపకుండా అసెంబ్లీలోనే ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా చేయకుండా బాబుని బిల్లుని వ్యతిరేకించేలా చేసి మూడు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే పద్మవ్యూహంలో బాబు ఇరుక్కున్నాడు అంటూ వైకాపా ఒక సరికొత్త వాదనను తెరమీదకు తీసుకు వచ్చింది..!

ఇందులో వాస్తవాలను మూడు రోజుల్లో జరిగిన పరిణామాలు గమనిస్తే కీలకమైన అంశాలు 2 రూల్ 71 మరియు మండలి చైర్మన్ విచక్షణాధికారం తో సెలెక్ట్ కమిటీకి పంపడం.. ఈ రెండూ వైకాపా ఊహించిన అంశాలు అయితే కావు ఆ రెండు అంశాలను తిప్పికొట్టడానికి వారు పడని పాట్లు లేవు అని స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏ విధంగా సమర్థించుకుంటంన్నారో అర్థం కావడం లేదు

పైగా మూడు రాజధానుల అంశం ప్రజల్లో సానుకూలత లేదు ఈ అంశం సరైన ప్రాతిపదికత ఏదీ లేనప్పటికీ గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న వివిధ పోల్స్ లో మూడు రాజధానుల కు కేవలం 30 శాతం మించి ఏ ఒక్క పోల్ లోను అనుకూత లేకపోవడం ఒక ప్రామాణికంగా భావించవచ్చు! పైగా విశాఖలో అన్నకి ఆదరణ రాయలసీమలో హైకోర్టు వలన పెద్దగా ఉపయోగం లేకపోవటం .. జీతాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితులలో తమ ఆర్థిక రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు అనేది కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల్లో జగన్ పద్మవ్యూహంలో బాబు ఇరుక్కున్నారు అనే వైకాపా వాదనలో పస లేదు కేవలం ఒక కవరింగ్ అని అర్థమవుతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here