ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ – కనులు కనులు దోచాయంటే రివ్యూ

0
51

 

కొన్ని సినిమాలు ఎటువంటి హడావిడి లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధిస్తాయి. అలాంటి కొన్ని సినిమాల్లో కనులు కనులు దోచాయంటే ఒకటి. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలియదు కనీసం ట్రైలర్ కూడా చాలా మంది చూసిఉండరు. కానీ దుల్కర్ సల్మాన్ ఉన్నాడనే నమ్మకంతో థియేటర్ కి వెళ్తే మాత్రం మీకు మంచి కిక్ ఇస్తుంది ఈ సినిమా. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా ఆకట్టుకున్నాయి. డబ్బింగ్ సినిమా అయినా కూడా దుల్కర్ సల్మాన్ సొంత వాయిస్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఆన్ లైన్ క్రైమ్ అనే కొత్త కథ కావడం తో సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఆసక్తి పుట్టిస్తాయి. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ అక్కడక్కడా కొంచం ల్యాగ్ అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరోయిన్ రీతూ వర్మ కూడా బాగా నటించింది. కేవలం ఐదు పాత్రల చుట్టూనే ఈ కథ అల్లుకున్నాడు దర్శకుడు దేసింగ్ పెరియసామి. చేసే దొంగతనాలు రోటీన్ గా అనిపించినా. స్క్రీన్ ప్లే తో ఆదరకోటాడు దర్శకుడు. తన 25వ సినిమా కోసం ఆసక్తికరమైన కథను ఎంచుకున్నాడు దుల్కర్ సల్మాన్. దానికి తగట్టు తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. రీతూ తో కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. డబ్బింగ్ సినిమా అయినా కూడా డైలాగులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకు సర్ ప్రైజ్ ప్యాకేజ్. నటుడిగానూ ఈయన అదుర్స్.

ఓవరాల్ గా కనులు కనులను దోచాయంటే. ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా మంచి విజయం సాధించింది.

Rating : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here