ఆమాద్మీ పార్టీ సంబరాలకు బ్రేక్ వేసిన కేజ్రీవాల్.

0
53

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ మరోసారి తన సత్తా చాటుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ నేతలకు షాక్ ఇచ్చాడు. విజయోత్సవాల్లో భాగంగా ఇక్కడే గాని టపాసులు కాల్చవద్దంటూ కార్యకర్తలకు ఆదేశించారు.  ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ పార్టీ నేతలు విజయోత్సాహంతో సంబరాలకు సిద్ధమైనప్పటికీ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని టపాసులు కాల్చవద్దంటూ కేజ్రీవాల్ ఆదేశించినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టపాసుల మినహా స్వీట్లు, హాట్లు పంచిపెట్టేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇవాళ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఆమాద్మీ పార్టీ విజయ వైపు దూసుకుపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here