ఫ్యామిలీ ఆడియన్స్ కు పండగే – ప్రతిరోజూ పండగ రివ్యూ

0
123

రీసెంట్ గా వచ్చిన చిత్రలహరి సినిమాతోటి మంచి విజయాన్ని అందుకున్న సాయి తేజ్ ఈసారి కామెడీ జోనర్ లో మంచి విజయాలు సాధించిన మారుతీ తో జత కట్టి ప్రతిరోజు పండగ సినిమాతోటి మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒకసారి చుసేదాం.   అప్పుడెప్పుడో ఆత్రేయ గారు ఒక మాట చెప్పారు చావు  కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ అని ఆ ఒక లైన్ ని మారుతీ గారు సీరియస్ గా తీసుకొని  ఏకంగా ఒక ఫామిలీ డ్రామానే రూపొందించాడు. ప్రతి రోజు పండగే తెలియని కథ కాదు. ఇది వరకు మనం చుసిన కథే అదే సినిమా మొదట్లో మారుతీ గారు కూడా చెప్పేసారు.

ఆలా తెలిసిన కథనే  మనసుకు నచ్చేలా కాస్త నిష్టూరంగా చెప్పే ప్రయత్నం చేసాడు మారుతి ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా నిజానికి ఈ సినిమాలో చూపించాడు మారుతి. పిల్లల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళను చేసి చివరి రోజుల్లో వాళ్ళ తోడు లేక ఒంటరి జీవితం అనుభవించే తండ్రి కథ ఇది ఆలా అని ఇక్కడ పిల్లలు విలన్లు కాదు పరిస్థితులే ప్రతినాయకులు అదే  సినిమాలో కూడా చూపించే ప్రయత్నం చేశాడు మారుతి. దానిలో భాగంగా సినిమా మొత్తం వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. ఇవ్వాల్సిన సందేశాన్ని ఇస్తూ అక్కడక్కడ చురకలు కూడా అంటించాడు మారుతి. ఫస్టాఫ్ చాలా వరకు పూర్తిగా కామెడీతో సాగుతుంది. రావు రమేష్, రాశిఖన్నా లాంటి క్యారెక్టర్లతో కావాల్సినంత కామెడీ చేయించాడు మారుతి. సెకండాఫ్ మరింత ఎమోషనల్ గా సాగింది. అయితే అక్కడక్కడ ఎమోషన్ మిస్ఫైర్ కూడా అయింది.మాటిమాటికీ బ్రతికున్న మనిషికి చచ్చిపో అని చెప్పడం కాస్త కష్టంగా అనిపిస్తుంది.అక్కడికి సెకండ్ హాఫ్ లో రావు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. శతమానం భవతి ఛాయలు కనిపించినా రెండు విభిన్నమైన కథలే. సత్యరాజ్ తాత పాత్రకు ప్రాణం పోశాడు. సాయి ధరంతేజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ లేకపోతే సినిమా ఇంతలా వచ్చిఉండేది కాదేమో అనే రీతిలో నటించి సినిమాకి ప్రాణం పోసాడు రావు రమేష్. ఇక ఏంజిల్ ఆర్నాగా రాశి ఖన్నా బాగా చేసింది.

ఓవరాల్ గా ప్రతి రోజు పండగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫామిలీ ఆడియన్స్ కి మాత్రం పండగే అనాలి.

Rating : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here