కక్షతోనే ఈ పని ఎవరు చేశారో – పృథ్వి రాజ్

0
63

కక్షతోనే ఈ పని ఎవరు చేశారో – పృథ్వి రాజ్ ఆడియో టేపుల వ్యవహారంపై ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. తితిదే ఉద్యోగినితో అంటూ వచ్చిన ఆడియోలోని వాయిస్‌ తనది కాదన్నారు. తన వ్యాఖ్యలపై విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించాలన్నారు. లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని ఎవరు చేశారో, ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని వైకాపా పెద్దలకు వివరించానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here