ఫ్యాన్స్ కోసమే రూలర్ – రూలర్ రివ్యూ

0
109

బాలయ్యా బాబు సినిమా వస్తుందంటే చాలు మాస్ జనాలకు పండగే అని చెప్పుకోవచ్చు ఎందుకంటె సీన్స్ పండించడం లో ఆయనకు పోటీ ఎవరు రాలేరు. ఇక బాలయ్యా బాబు తీసిన కథానాయకుడు మహానాయకుడు ఘోర పరాజయం చెందిన విషయం మనకు తెలిసిందే ఆ సినిమా ప్రభావం నుండి త్వరగా కోలుకొని కే ఎస్ రవికుమార్ గారి డైరెక్షన్ లో రూలర్ అంటూ మన ముందుకు వచ్చాడు.
సినిమాలు చూసిన తర్వాత ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు. రూలర్ సినిమా చూసిన తర్వాత నా పరిస్థితి అదే. నందమూరి బాలకృష్ణ సినిమా కదా. మాస్ సీన్స్ ఉంటాయి. తిరుగుండదు అనుకున్నా. కానీ బాలయ్య మాత్రం మరోసారి పరమ రొటీన్ కథతో వచ్చి సహనానికి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఆయనకు ఉన్నా ఇమేజ్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టి కె.ఎస్.రవికుమార్ మాయలో పడిపోయాడు మన బాలయ్యా. కొన్ని వందల సార్లు చూసిన కథను దర్శకుడు మళ్లీ మళ్ళి చెప్పిన బాలకృష్ణ గారు ఎలా ఒప్పుకున్నారు అనేదే ఆశ్చర్యం. ఆయన చేసిన లయన్, విజయేంద్ర వర్మ లాంటి కథలే ఈ సినిమాలో గుర్తుకొస్తాయి. జై సింహా సినిమాలో కనీసం యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కానీ రూలర్ మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది..ఫస్ట్ హాఫ్ కొంచం పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం మన సహనాన్ని పరీక్ష పెడుతుంది. బాలకృష్ణ లాంటి స్థాయి ఉన్న హీరో సినిమాలో వెకిలి కామెడీ చేయించడం ఎవరికీ నచ్చదు. కానీ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలో ఏదయినా మంచి సీన్స్ ఉన్నాయి అంటే అది రైతుల గురించి చెప్పిన డైలాగులే. ఇక కథ ఎలా ఉన్నా బాలకృష్ణ మాత్రం మరోసారి ఇరగదీశాడు అనే చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ లో కంపెనీ చైర్మన్ గా సెకండ్ హాఫ్ లో పోలీస్ అధికారిగా తన నటన విశ్వరూపం చుపించాడు. ఆయన ఎనర్జీకి నిజంగానే దండం పెట్టొచ్చు. ప్రతి పాటలో బాలయ్య డాన్సులు అదుర్స్ థియేటర్స్ లో విజిలే విజిల్స్. హీరోయిన్లు కేవలం అందాల ఆరబోతకు సరిపోయారు. వేదిక క్యారెక్టర్ కొంచం నటనకు స్కోప్ ఉంది. అందులో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ, సయాజీషిండే పర్లేదు అనిపించారు.

ఓవరాల్ గా రూలర్ తో రూల్ చేదాం అని వచ్చిన బాలయ్యాకు మాత్రం ఈ సినిమా డిస్సపాయింట్ అనే చెప్పాలి. కానీ బాలయ్యా ఫ్యాన్స్ కు అలాగే బి,సి సెంటర్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా పెద్ద పండగే అని చెప్పొచ్చు.

Rating : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here