సెలక్ట్ కమిటీ అంటే ఏంటి ?? సెలక్ట్ కమిటీ కి ఉన్న అధికారాలు ఏంటి ??

0
78

1.సెలక్ట్ కమిటీకి కాలపరిమితిని మండలి ఛైర్మన్ నిర్ధేశించవచ్చు.
2.బిల్లు ప్రవేశపెట్టిన మంత్రే సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ గా ఉంటారు.
3.సభలో బలాబలాల ప్రకారమే సెలెక్ట్ కమిటీని నియమిస్తారు.
4.బిల్లుపై సెలక్ట్ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించి సవరణలు సూచించవచ్చు.
5.సెలక్ట్ కమిటీ నివేదికను మండలికే సమర్పించాల్సి ఉంటుంది.
6.సెలక్ట్ కమిటీ నివేదికపై మండలిలో చర్చిస్తారు
మండలిలో చర్చ తర్వాత అవసరమైన మేరకు సవరణలు చేయవచ్చు
7.సవరణలతో కూడిన బిల్లును తిరిగి శాసనసభకు పంపిస్తారు
8.మండలి నుంచి తిరిగి వచ్చిన బిల్లులోని సవరణలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోపోవచ్చు
9.ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా బిల్లును తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతారు
అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మళ్లీ మండలికి పంపుతారు
10.మండలి ఆమోదించినా… ఆమోదించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా ఆమోదం కోసం గవర్నర్ కోసం పంపవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here