శీనయ్య క్యారెక్టర్ అదిరింది కానీ – వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ

0
45

ఏ ముహూర్తానికి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేసాడో కానీ అతని కెరీర్ కి అదే పెద్ద ప్లస్ అదే పెద్ద మైనస్ లా మారింది ఆ సినిమా అనేది ఓ చరిత్ర ఎప్పుడో గానీ అలాంటి సినిమా రాదు. కానీ విజయ్ దేవరకొండ చేసే ప్రతీ సినిమా అర్జున్ రెడ్డి లా ఉండాలి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే విజయ్ ఇప్పటికీ అదే హ్యాంగోవర్‌లో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి ఛాయలు కనిపిస్తాయి. మధ్యలో సింగరేణి శీనయ్య వచ్చి ఉపశమనం కలిగించినా గౌతమ్ పాత్ర మాత్రం అర్జున్ రెడ్డినే గుర్తు చేసాడు.అందుకే ప్రేక్షకులు కూడా విజయ్ దేవరకొండ సినిమా అంటే ఇలా ఉంటుందని అంచనాకు వచ్చేసారు. వరల్డ్ ఫేమస్ లవర్‌తో కూడా ప్రేమలో మరో కోణాన్ని చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. కథ చాలా మములుది అయిన అర్థమయ్యేలా మాత్రం ఉన్న కథను కొత్తగా చెప్పలేకపోయాడు దర్శకుడు. సినిమా మొదలుపెట్టడమే ఎమోషనల్‌గా చేసాడు క్రాంతి మాధవ్. తొలి 15 నిమిషాల్లోనే కథ అర్థమైపోతుంది ఆ తర్వాత మిగిలిన కథలు మొదలయ్యాయి. వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగిపోయింది. ముఖ్యంగా సింగరేణి శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది సినిమాకి అదే పెద్ద ప్లస్ అవుతుంది. శీనయ్యా ఎపిసోడ్ కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది కానీ మరో స్థాయిలో ఉంటుంది. ఇంకాసేపు ఉన్నా బాగుండేదనిపిస్తుంది. శీనయ్యగా విజయ్ దేవరకొండ ఆదరకోటాడు. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ పాత్రలు మరో లెవెల్ లో ఉంటుంది. కానీ ఆ ఎపిసోడ్ తర్వాత సినిమా పూర్తిగా దారి తప్పుతుంది. పారిస్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎమోషన్ కూడా అంతగా పండలేదు. స్లో నెరేషన్ సినిమాకు చాలా పెద్ద మైనైస్. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బ తీసింది. ఇక క్లైమాక్స్ మరోసారి అర్జున్ రెడ్డి తరహాలోనే అనిపిస్తుంది. నటుడిగా విజయ్ దేవరకొండ మరోసారి అదరగొట్టాడ. ఈ సినిమాలో తను ఎంత గొప్ప నటుడో మరో సారి నిరూపించాడు. ముఖ్యంగా గౌతమ్ పాత్రకు ప్రాణం పోసాడు. యామినిగా రాశీ ఖన్నా పర్లేదు అనిపిస్తుంది. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ సినిమాకు ప్రాణం పోసింది. కేథరిన్, ఎజిబిల్లా పర్లేదు అనిపిస్తారు. గోపీ సుందర్ సంగీత పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఉండదు. క్రాంతి మాధవ్ చెప్పాలనుకున్న కథ బాగుంది కానీ కథనం ఆకట్టుకోలేదు.

ఓవరాల్‌గా సింగరేణి శీనయ్య క్యారెక్టర్ అదిరింది కానీ వరల్డ్ ఫేమస్ లవర్ అని మాత్రం అనిపించుకోలేదు.

Rating – 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here